ఆగిన వర్షం.. మ్యాచ్ తిరిగి ప్రారంభం

-

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. వర్షం ఆగిపోవడంతో గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు 7:15 గంటలకు మ్యాచ్ను తిరిగి ప్రారంభించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన 10 నిమిషాల తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోవడంతో బ్రేక్ టైమ్ను తగ్గించారు.

ఇకపోతే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌ 2023లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలతో చెలరేగాడు. శ్రీలంకతో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్, షాహిది అఫ్రిది రికార్డులను బ్రేక్ చేశాడు. వన్డేల్లో వేగంగా 10 వేలు పరుగులు చేరుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. సచిన్ (259 ఇన్నింగ్స్‌లు)ను దాటేశాడు. ఆ తరువాతి స్థానంలో సౌరవ్ గంగూలీ (263), రికీ పాంటింగ్ (266) ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version