బీజేపీలోకి చేరేందుకు వచ్చిన చీకోటి.. రాష్ట్ర కార్యాలయం వద్ద అనూహ్య పరిణామం

-

బీజేపీలో చేరేందుకు ఇవాళ రంగం సిద్ధం చేసుకున్న చీకోటి ప్రవీణ్ అనూహ్య పరిణామం ఎదురైంది. చివరి నిమిషంలో చేరికకు బ్రేక్ పడింది. కర్మన్‌ఘాట్ నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్‌కు వింత అనుభవం ఎదురైనట్లు తెలిసింది. స్టేట్ ఆఫీస్‌లో లీడర్లు ఎవరూ లేకపోవడంతో తన చేరిక వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. తన చేరికను అడ్డుకుంటున్నారని చికోటి ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చేరికపై కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇది జరిగిందని చికోటి స్పష్టం చేశారు.

చికోటి ప్రవీణ్ గత నెలలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతల్ని కలిశారు. బండి సంజయ్, డీకే అరుణను కలిసి శాలువా కప్పి సత్కరించారు. వీరితో పాటు రాంచందర్ రావును కూడా కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వారికి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిల నుంచి ఏదో ఓ అసెంబ్లీ వస్తుందని, పోటీ చేస్తానని చికోటి భావించారు. ఇవన్నీ గమనిస్తే రేపో, మాపో చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చికోటి ప్రవీణ్ ను పార్టీలో చేరే వరకు ఏం జరుగుతుందోనని అంతా భావించారు. ఊహించినట్లుగానే చివరి నిమిషంలో బీజేపీలో చికోటి చేరికకు బ్రేక్ పడింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version