సౌదీ అరేబియా షాకింగ్‌ నిర్ణయం.. ఆ కలర్‌లో ఉన్నాయని టాయ్స్‌ బ్యాన్‌

-

ముస్లిం దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా దేశం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా దేశంలో రెయిన్‌బో కలర్స్‌ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని అధికారులు రెయిన్‌బో కలర్స్‌లో ఉన్న బొమ్మలు, పిల్లల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అవి స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. రాజధాని రియాద్‌లోని దుకాణాల నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అనేక రకాల వస్తువులను తొలగిస్తున్నట్లు అల్-ఎఖ్బరియా నివేదిక తెలిపింది. ఇలా ఆంక్షలు విధించిన వాటిలో హెయిర్ క్లిప్‌లు, పాప్-ఇట్స్, టీషర్టులు, టోపీలు, పెన్సిల్ వంటివి ఉన్నాయి. ఈ విషయంపై ఓ అధికారి మాట్లాడుతూ.. ఇవన్నీ ఇస్లామిక్ విశ్వాసం, ప్రజా నైతికతలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.

యువ తరాన్ని లక్ష్యంగా చేసుకుని స్వలింగ సంపర్క రంగులను ప్రోత్సహిస్తాయని తెలిపారు. దారి మళ్లించడం, ఇతర అంశాలపై ఆసక్తిని పెంచేలా చేయడం, కామన్‌సెన్స్‌కు విరుద్ధమైన చిహ్నాలు, సంకేతాలను తెలియజేసేలా ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. అలాంటి వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలు చట్టపరమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version