తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వాయు’ గండం‘ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా తమిళనాడు కోష్టల్ ఏరియాతో పాటు, రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా చెన్నై నగరంతో పాటు పరిసర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా దాదాపు 200 కిలోమీటర్లు మరియు పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం పొంచి ఉంది. శుక్రవారం (నవంబర్ 19) ఉదయం సమయానికి అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి-చెన్నై మధ్య దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ముంచుకొస్తున్న వాయు’గండం‘ .. రేపు తీరం దాటనున్న వాయుగుండం.
-