నిరుద్యోగులకు శుభవార్త..పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్‌. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గత 15 రోజుల నుంచి ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version