BREAKING : మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరం !

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే.. బీజేపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి.. కోమటి రెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి.. ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నారు. బీజేపీ అభ్యర్థి.. కోమటి రెడ్డి రాజ గోపాల్‌ రెడ్డికి…నిన్న రాత్రి నుంచి తీవ్ర జ్వరం ఉందని సమాచారం అందుతోంది.

దీంతో బీజేపీ అభ్యర్థి.. కోమటి రెడ్డి రాజ గోపాల్‌ రెడ్డికి వారం రోజుల పాటు రెస్ట్‌ అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం అందుతోంది. మరి దీనిపై బీజేపీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కోమటి రెడ్డి రాజ గోపాల్‌ రెడ్డికి వారం రోజుల పాటు రెస్ట్‌ తీసుకుంటే.. బీజేపీ ముఖ్యనేతలు ప్రచారం చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. కాగా.. నవంబర్‌ 3న మునుగోడు ఉప ఎన్నిక జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version