సీఎం కావడానికే బీజేపీలోకి వస్తున్నా – రాజగోపాల్ రెడ్డి

-

సీఎం కావడానికే బీజేపీలోకి వస్తున్నానని హాట్‌ కామెంట్స్‌ చేశారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నికతో రాజకీయాలు మారతాయి. 100 శాతం మునుగోడు ప్రజలు నావైపే వున్నారు. నా త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది.

బాధతో రాజీనామా చేశా.. సోనియా, రాహుల్ అంటే గౌరవం అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. సీఎం కావడానికే బీజేపీలోకి వస్తున్నానని…. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాల అభివృద్ధి అని వెల్లడించారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తున్నాడని మండిపడ్డారు.

తాను కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని కానీ ఎక్కడా విమర్శించని చెప్పానని.. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీని బలిదేవత అన్న మాట వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు పథకం ప్రకారమే డబ్బులతో పిసిసి పదవిని కొనుక్కున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version