మహాభారతం విస్తృతమైన కథాంశం కలిగిన ఇతిహాసమని చెప్పవచ్చు. ఈ మహాభారతంలో ఎక్కువ సంఖ్యలో పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మహాభారతాన్ని సినిమాగా తీయాలని కొంతమంది దర్శకులు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ లిస్టులో రాజమౌళి కూడా ఉన్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు వంటి పాత్రలు ముఖ్యమైనవి అని చెప్పవచ్చు.. అలా చేసిన సినిమాలు దాదాపుగా విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. ఈ కథ లోని పాత్రలే ముఖ్య కారణమని చెప్పవచ్చు.. ప్రస్తుతం జనరేషనికి తగ్గట్టుగా ఈ మహాభారతంలో కొన్ని భాగాలను తెరకెక్కించాలని దాసరి గారు అనుకున్నారు కానీ అది కుదర లేకపోయిందట.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ కి ఇలాంటి కథలు తీసేవారు లేరని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ రాజమౌళి తలకెక్కించిన మగధీర సినిమాతో అందరి దృష్టి ఆయన వైపుగా మళ్ళింది. ఆ తర్వాత బాహుబలి చిత్రంతో రాజమౌళి పై మరింత నమ్మకం కుదిరింది. ఈ సినిమాకి ఉపయోగించిన కాస్ట్యూమ్స్, టెక్నీషియన్, గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఆయన అభిమానుల సైతం మహాభారతం సినిమాని రాజమౌళి ఒక్కరే తెరకెక్కించగలరని బలమైన విశ్వాసాన్ని తెలుపుతున్నారు.
మహాభారతం సినిమా చేస్తే ఒకవైపున నటీనటులు మరొకవైపున కథనాలు, గ్రాఫిక్స్ వంటివి కలిపి నడిపించడం కేవలం రాజమౌళికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా మహాభారతం సినిమా తెరకెక్కించడం రాజమౌళి డ్రీమ్ అని పలుసార్లు చెప్పుకొచ్చారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు కానీ తాజాగా ఒక సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేశారు రాజమౌళి. ఈ సినిమా తెరకెక్కించడానికి తనకి మరింత సమయం పడుతుందని.. అయితే తన చివరి సినిమా ఇదే అవుతుంది అని రాజమౌళి తెలియజేయడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పైన కొంతమంది నటీనటుల చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.