శివాత్మిక ఎమోష‌న‌ల్ పోస్ట్.. రాజ‌శేఖ‌ర్‌కు ఏమైంది..?

-

కోవిడ్ ప్ర‌పంచాన్ని ఒక్క‌సారిగా ప‌దేళ్లు వెన‌క్కి తీసుకెళ్లింది. అభివృద్ధి ప‌రంగా, ఆర్థిక వ్య‌వ‌‌స్థ ప‌రంగా, జీవన శైలి ప‌రంగా.. అల‌వాట్ల ప‌రంగా.. కొన్ని ల‌క్ష‌ల మంది క‌రోనా వ‌ల్ల జీవితాల్ని జీతాల్ని.. ఉద్యోగాల్ని కోల్పోయారు. గ‌త ఏడు నెల‌లుగా క‌రోనా స్వైర విహారం చేస్తూనే వుంది. దీని బారిన ఇప్ప‌టికే ల‌క్ష‌లు.. కోట్ల మంది ప‌డుతున్నారు. కొంత మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డుతుంటే కొంత మంది ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్రాణాలు విడుస్తున్నారు.

‌సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రికీ క‌రోనా చుక్క‌లు చూపిస్తోంది. టాలీవుడ్‌లో దీని బారిన ప‌డిన వారి సంక్ష భారీగానే వుంది. బండ్ల గ‌ణేష్‌, కీర‌వాణి, రాజ‌మౌళి ఫ్యామిలీతో పాటు దాన‌య్య వంటి వారు కూడా దీని బారిన ప‌డి కోలుకున్నారు. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ కూడా క‌రోనా బారిన ప‌డి స‌ఫ‌ర‌వుతోంది. త‌మ‌కు క‌రోనా సోకింద‌ని అయితే త‌మ పిల్ల‌లు శివాని, శివాత్మ‌క సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డార‌ని, త‌ను, జీవిత కోలుకుంటున్నామ‌ని రాజ‌శేఖ‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

అయితే తాజాగా రాజ‌శేఖ‌ర్ పెద్ద‌కుమార్తె శివాత్మి‌క‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ప్రియమైన అందరికి. కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టంగా వుంది. అయినప్పటికీ ఆయ‌న‌ గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ‌లే మమ్మల్ని రక్షించాయ‌ని మేము నమ్ముతున్నాము. నాన్నా త్వరగా కో

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

లుకోవాలని ప్రార్థించమని అంద‌రిని అడుగుతున్నాను. మీ ప్రేమతో నాన్న కోవిడ్‌ని జ‌యించి బలంగా బయటకు వస్తాడు` అని శివాత్మిక పెట్టిన పోస్ట్ ప‌లువురిని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version