ముఖ్యమంత్రి కేసీఆర్ సోయి తప్పి మాట్లాడినట్లు కన్పిస్తోంది. నీతి అయోగ్ సమావేశానికి సీఎం వెళ్లకపోవడంవల్ల తెలంగాణ ప్రజలకు నష్టమే తప్ప లాభం జరగదనే సోయి కేసీఆర్ కు లేకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు రాజాసింగ్. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే కనీస ఇంగిత జ్ఝానం లేని కేసీఆర్ నీతి అయోగ్ పై విమర్శలు చేయడం విడ్దూరం. నీతి అయోగ్ రాజ్యాంగ బద్ద సంస్థ. ఆ సంస్థ నిర్వహించే సమావేశాన్ని బహిష్కరించడమంటే రాజ్యాంగాన్ని, ప్రజలను అవమానించడమే అని అగ్రహించారు.
నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ ఆరోపించడం హాస్యాస్పదం. దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే సమావేశం. అందులో కేసీఆర్ కూడా ఒకరు. మిగిలిన వారికి ఎంత సమయం ఇస్తారో.. కేసీఆర్ కు అంతే ఇస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి? అని చురకలు అంటించారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న ప్రతిపక్ష శాసనసభ్యులను బెల్ కొట్టించి అడ్డుకుంటున్న కేసీఆర్…. తాను మాట్లాడుతుంటే నీతి అయోగ్ బెల్ కొట్టి అడ్డుకుంటోందని చెప్పడం సిగ్గు చేటు… అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్స్ చేస్తున్న నియంత నీతి అయోగ్ పై అవాకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ కు డబ్బులు, కమీషన్ల యావ తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవనే విషయం మరోసారి రుజువైందని.. జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్లానింగ్ కమీషన్ గొప్పదని పొగిడిన కేసీఆర్.. అదే నిజమైతే దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని? ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఎందుకు ఇబ్బంది పడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.