కేటీఆర్ కు రాజాసింగ్ బహిరంగ లేఖ… 600 మంది నిరుద్యోగులను చంపింది మీరే !

-

మంత్రి కేటీఆర్ కు బీజేపీ శాసన సభాపక్ష నేత రాజాసింగ్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ గారి దీక్షకు భయపడి కేటీఆర్ బహిరంగ లేఖ రాశాడని రాజా సింగ్ చురకలు అంటించారు. ఉద్యోగాలెప్పుడిస్తారో చెప్పమని అడిగితే కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 600 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని.. దేశంలోనే లే అతి తక్కువ నిరుద్యోగం తెలంగాణ ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు.

బిస్వాల్ కమిటీయే 1లక్షా 92 వేల ఖాళీలున్నాయని చెప్పిన విషయం మరిచిపోయారా ? అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఏడేళ్ల లో ఒక్క గ్రూప్-1, మూడేళ్లలో ఒక్క నోటిఫికేషన్ వేయని సిగ్గుమాలిన ప్రభుత్వం ఇదని.. బహిరంగ లేఖ పేరుతో కేటీఆర్ నిరుద్యోగులను అవమాన పరుస్తున్నాడని రాజా సింగ్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగులరా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ గారు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపండని పేర్కొన్నారు. ఈ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version