బెంగళూరుపై రాజస్థాన్‌ ఘన విజయం..

-

ఐపీఎల్‌–2022 ఫైనల్లో టాప్‌–2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి ఆర్సీబీ, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన పోరులో చివరకు రాజస్థాన్‌దే పైచేయి అయింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2లో రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.

రజత్‌ పటిదార్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌ లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించి విజయ దుందుభి మోగించింది. 60 బంతుల్లో 106 నాటౌ ట్‌; 10 ఫోర్లు, 6 సిక్స్‌ లు బాది ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా బట్లర్‌ నిలిచాడు. ఈ సీజన్‌లో నాలుగో సెంచరీ సాధించాడు బట్లర్‌. అయితే.. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్థాన్‌ తలపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version