సినిమాలకు గుడ్ బై చెప్పనున్న రజినీకాంత్.. కారణం..?

-

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇదే వార్తలు కోలీవుడ్ మీడియాలో కోడే కూస్తూ ఉండడం గమనార్హం. దక్షిణాదిన పాగా వేయాలని బిజెపి ఎప్పటినుంచో కలలు కంటుంది. కానీ ఒక కర్ణాటక మినహా ఏ రాష్ట్రంలోనూ కూడా తన అధికారాన్ని చేజిక్కించుకోలేకపోవడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే సౌత్ పై గట్టిగా ఫోకస్ పెట్టి పార్టీ బలోపేతం చేయాలని అనేక వ్యూహాలను రచిస్తోంది. ఇక ఇప్పటికే తెలంగాణలో క్రమక్రమంగా ఎదుగుతూ టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు స్కెచ్ కూడా రెడీ చేస్తోంది.

ఇక తమిళనాడులో కూడా బిజెపి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం అందించి తన పాగా వేసుకునే ప్రయత్నం చేస్తుంది బిజెపి. ఇక ఇప్పుడు మరో అస్త్రాన్ని రెడీ చేసిందని చెప్పవచ్చు. రజినీకాంత్ ను బిజెపిలోకి చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన బీజేపీ ఇప్పుడు మరో రూపంలో ఆయన క్రేజ్ ను వినియోగించుకోవడానికి వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇకపోతే ఆగస్టు 15న ఢిల్లీలో జరిగిన 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆ తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు బిజెపి పెద్దలను కలిశారు. అయితే దేని గురించి చర్చించారు అన్న విషయం తెలియదు. కానీ ఆ తరువాత రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ ఎవ్ రవితో ఆయన భేటీ అయ్యారు. ఇక తమిళనాడు గవర్నర్తో రాజకీయాలపై చర్చించాను అంటూ రజనీకాంత్ బహిరంగ ప్రకటన చేయడంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.అంతేకాదు రాజకీయాలతో సంబంధం లేదని మళ్లీ గవర్నర్ తో రాజకీయాల గురించి మాట్లాడడమేమిటి అంటూ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు రజనీకాంత్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి . 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఎక్కువ సీట్లు సాధించే ప్రయత్నం బిజెపి చేస్తుంది అందుకే రజనీకాంత్ రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఏనుగు గవర్నర్ పదవి ఇవ్వాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాలకు రజనీకాంత్ గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version