ప్రతి ఒక్కరికీ చదువు చాలా అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకోవడం వల్ల ఆడ పిల్లలు తమ సొంత కాళ్ళ మీద నిలబడడానికి అవుతుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తప్పక చదువుకోవాలి. చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ చదువుకోవాలి అనుకునే ఆడపిల్లలకు పెళ్లి అడ్డం కాదని ఒక పెళ్లికూతురు నిరూపించింది.
ఇక అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే.. పెళ్లి కంటే కూడా చదువు చాలా ముఖ్యం అని ఆమె తెలిపింది. పెళ్లి, పరీక్ష ఒకే రోజు కావడంతో ఆమె కాస్త బాధపడినా సమయానికి వచ్చే పరీక్ష వ్రాయగలిగింది. నిజంగా ఈమె చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పెళ్లి రోజు కూడా పెళ్లి బట్టలతో వచ్చి పరీక్ష రాసింది.
ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తో కలిసి డిగ్రీ సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యారు. దీనిని చూసి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆశ్చర్యపోయారు. పరీక్ష రాసిన తర్వాత వధూవరులు పెళ్లి మండపానికి వెళ్లారు. గుజరాత్ లోని రాజ్కోట్ కి చెందిన శివాంగి పెళ్లి కంటే కూడా సెమిస్టర్ పరీక్షలకి ప్రాధాన్యత ఇవ్వడం అభినందించాల్సిన విషయం.
ఇప్పుడు కాకపోతే మరొక సారి రాయచ్చు అని ఆమె అనుకోలేదు. చదువుకి ఆమె ప్రాధాన్యత ఇచ్చిన తీరు చూస్తుంటే శభాష్ అని అంటారు. నిజంగా ఈమెను చూసి చాలా మంది ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి. పరీక్ష తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..
పెళ్లి తేదీ నిర్ణయించినప్పుడు పరీక్ష తేదీ ఇంకా రాలేదని తన పరీక్షలు ఎంతో ముఖ్యమని తన భర్తకి కూడా ఆమె చెప్పింది. ఇరు కుటుంబాలు కూడా తీవ్ర చర్చ జరిపి ఆఖరికి ఆమె పరీక్షకి విలువ ఇచ్చారు. ఈ పోస్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి చదువు ఎంత ముఖ్యమో నేర్చుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్లు.