ఆగని విపక్షాల ఆందోళన.. రాజ్యసభ మళ్ళీ వాయిదా

-

విపక్ష ఎంపీల ఆందోళన మధ్య రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు పెద్దల సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. ఉదయం ప్రతిపక్షాల ఆందోళన మధ్య ప్రారంభమైన కొద్దిసేపటికే సభను వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సభలో అదానీ వివాదంపై జేఏసీ ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేస్తుండడంతో సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు జగదీప్ వెల్లడించారు.

మరోవైపు లోక్సభ కూడా ఈరోజు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. సాయంత్రం నాలుగు గంటలకు లోక్సభ మళ్లీ ప్రారంభం కానుంది. అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version