జబర్దస్త్ మేడం ఆ నలుగురు ఎవరు? రాపాకకు 10 వేలు ఎక్కువ!

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి అనుకూలంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యే క్రాస్ ఓటు చేసిన విషయం తెలిసిందే. ఇలా అలా క్రాస్ ఓటు చేశారని ఆరోపిస్తూ..ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు..అలాగే ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు 10-15 కోట్లు ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

అయితే సజ్జల ఆరోపణలని టి‌డి‌పి, నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు తిప్పికొడుతున్నారు. తమ పార్టీ నుంచి తీసుకున్న నలుగురు ఎమ్మెల్యేలకు వైసీపీ ఎంత ఇచ్చిందని టి‌డి‌పి ప్రశ్నిస్తుంది. అసలు తమని సస్పెండ్ చేయడానికి సజ్జల ఎవరు? అని రెబల్ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. విలేఖరిగా పనిచేసే సజ్జల వేల కోట్లు ఎలా సంపాదించారని అంటున్నారు. సజ్జల వల్లే వైసీపీ నాశనం అవుతుందని ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలోనే జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం..తనకు టి‌డి‌పి పది కోట్లు ఆఫర్ చేసిందని, టి‌డి‌పికి ఓటు వేయమని అడిగారని ఆరోపించారు. దీన్ని కూడా టి‌డి‌పి తిప్పికొడుతుంది జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లినందుకు రాపాకకు వైసీపీ ఎంత ఇచ్చిందని ఫైర్ అవుతున్నారు. ఇక తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, ప్రజలు బాబుకు బుద్ధి చెబుతారని మంత్రి రోజా ఫైర్ అయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మంత్రి రోజాకు టి‌డి‌పి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. తమ దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నారని, ఇప్పుడు అదే మీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీని గెలిచామని,  ఇది దేవుని స్క్రిప్ట్ అంటూ అనిత..రోజాకు కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్ మేడం.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో అని అన్నారు. పేకాట క్లబ్బులు నడిపిన రాపాక రూ.10 కోట్ల కోసం మాట్లాడుతున్నావు.. అసలు నీకు 10 వేలు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version