నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

-

నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో ప్రమాణ స్వీకారోత్సవం. యూపీ నుంచి రాజ్యసభకు టీబీజేపీ నేత డా.లక్ష్మణ్‌ ఎన్నికయ్యారు. అయితే ఆయనచే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యసభ సభ్యులుగా 31 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అనివార్య కారణాలతో నలుగురు సభ్యులు గైర్హాజరు కానున్నారు. అయితే.. నిర్మాలా సీతారామన్‌, పియూష్‌ గోయల్, 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నరేంద్రమోడీ దక్షిణాది చెందిన నలుగురి పేర్లను రాజ్యసభ పదవికి నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేసి మరి తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓక ముద్ర వేశాయని ప్రశింసించారు. రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు మరో కేరళకు చెందిన ప్రముఖ అథ్లేట్ పీటీ ఉష, తమిళనాడుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా.. ఏపీకి చెందిన ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్..(ఆంధ్రప్రదేశ్) కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే…ను మోదీ సర్కార్ రాజ్యసభకు నామినేట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version