గత ఏడాది కాలం నుంచి రైతులు… వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహోద్యమాన్ని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తాము తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు నరేంద్రమోడీ.
తాము తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు తీవ్రంగా వ్యతిరేకించారని… ఈ నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇకనైనా రైతులు తమ ఆందోళనను విరమించుకోవాలని కోరారు మోడీ. అయితే దీనిపై.. వ్యవసాయ ఉద్యమాన్ని అన్నీ తానై నడిపిస్తున్న రాకేష్ తికాయత్… స్పందించారు. తాము తక్షణమే ఆందోళన విరమించమని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు రాకేష్ థికాయత్. పార్లమెంట్లో చట్టాలను రద్దు చేసే వరకు తాము వేచి చూస్తామని స్పష్టం చేశారు. ”తక్షణమే ఆందోళన విరమించేది లేదని, పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం వేచి చూస్తామన్నారు. ఎంఎస్‌పితో పాటు రైతుల ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చించాలి.” అంటూ రాకేష్ తికాయత్ ట్వీట్ చేశారు.
आंदोलन तत्काल वापस नहीं होगा, हम उस दिन का इंतजार करेंगे जब कृषि कानूनों को संसद में रद्द किया जाएगा ।
सरकार MSP के साथ-साथ किसानों के दूसरे मुद्दों पर भी बातचीत करें : @RakeshTikaitBKU#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 19, 2021