రకుల్ ప్రీత్ సింగ్ లెటెస్ట్ గా నటిస్తున్న హిందీ సినిమా ’ఛత్రివాలి‘ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వం ఈ సినిమాలో రకుల్ కీలకప్రాత పోషిస్తోంది. ఛత్రివాలి అనే టైటిల్‌తో రూపొందిన ఈ సోషల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రకుల్ మునుపెన్నడూ చూడని, ప్రత్యేకమైన క్యారెక్టర్‌లో నటించింది. ’ఛత్రివాలి‘ సినిమాలో రకుల్ ’కండోమ్ టెస్టర్‘ క్యారెక్టర్ పోషిస్తోంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ లక్నోలో ప్రారంభమైంది. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అయి చిన్న పట్టణానికి చెందిన మహిళా నిరుద్యోగి, కండోమ్ టెస్టర్ గా మారుతుంది. ఈ రహస్యాన్ని అందరి వద్ద దాచే క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ నటించింది. ఈ చిన్న అంశం చుట్టూ సాగే కథ ప్రైక్షకులకు వినోదాన్ని పంచనుంది. డైరెక్టర్ తేజస్ దేవస్కర్.. ఈ చిత్రం సోషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది అన్నారు. ఇది చాలా ఆసక్తికరమైన పాత్ర అని.. చాలా థ్రిల్ గా ఉందని రకుల్ అంది. ప్రస్తుతం రకుల్ చేతిలో రెండు తమిళ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇండియన్ 2, అయాలాన్ సినిమాల్లో రకుల్ నటిస్తోంది.