రామ్ చరణ్, శంకర్ సినిమా ఫోటోస్ మరోసారి లీక్..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.ఈ సినిమా తో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తున్నాడట.అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయాలపై లీకైన ఫోటోస్ నిరూపించాయి. ఇప్పుడు మరో సారి ఈ సినిమా కు చెందిన ఫోటోస్ మరో సారి లీక్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. మెయిన్ గా సీనియర్ పాత్ర కోసం షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి కీలకమైన ఎపిసోడ్ సంబంధించిన షూటింగ్ ఇక్కడ జరుగుతోంది. తండ్రి పాత్రకు తగ్గట్టుగా రామ్ చరణ్ గెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు ఈ షెడ్యూల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో  కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకు సబంధించి పంచె, కుండువ వేసుకున్న చరణ్ లుక్ ఉంది. అంతే కాదు ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ కి ఓటు వేయాలని అభ్యర్థన చేస్తున్నట్టు సీన్స్ ఉన్నాయట. వచ్చే వేసవి కాలం వరకు షూటింగు పూర్తి చేసి విడుదల చేయాలని దిల్ రాజు నిర్మించినట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version