Ramcharan Hotstar: డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్‌..!

-

Ramcharan Hotstar: మారుతున్న కాలం అనుగుణంగా.. ప్ర‌తి రంగంలో మార్పులు చేటు చేసుకుంటున్నాయి. అది విజ్ఞన రంగ‌మైనా.. వినోద‌రంగ‌మైనా టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్నాయి.ఈ క్ర‌మంలోనే సినీ ప్ర‌పంచంలో ఎన్నో మార్పులు తెచ్చాయి ఓటీటీ సంస్థ‌లు. సినిమా రూపురేఖ‌ల‌నే మార్చివేశాయి. టాకీసులు, ఐమాక్స్ కెళ్లి సినిమా చూసే రోజుల నుంచి.. తాపీగా ఇంట్లో కూర్చోని మొబైల్ ఫోన్‌లలో చూసే రోజులను తెచ్చాయి ఓఓటీ లు. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల‌ను వినోదాన్ని పంచడానికి ప్ర‌ముఖ దిగ్గ‌జ కంపెనీలు ఓటీటీ రంగంలో అడుగు పెట్టాయి.

నిత్యం కొత్త కొత్త ప్యూచ‌ర్స్‌తో ప్రేక్షకులను త‌మ వైపుకు ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రాంతీయ భాషల మీద స్పెష‌ల్ ఫోకస్ పెట్టాయి ఓటీటీ సంస్థలు. ఈ క్రమంలోనే డిస్నీ ఫ్ల‌స్‌ హాట్ స్టార్ కూడా తెలుగులో అడుగుపెట్టింది. ఇందుకోసం డిస్నీ హాట్ స్టార్ త‌న బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను నియ‌మించుకుంది. డిస్నీ హాట్ స్టార్‌ ‘మన వినోద విశ్వం’ అనే ట్యాగ్‌లైన్ తో ప్ర‌మోట్ చేయ‌నున్నారు రామ్ చరణ్. దీని కోసం చరణ్‌కి డిస్నీ హాట్ స్టార్ భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం. ఆయనకు ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు టాక్.

హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘డిస్నీ హాట్ స్టార్ కంటెంట్‌కు దిక్సూచిలా నిలుస్తోంది.
ఇండియ‌న్ అలారించ‌డానికి ప్రాంతీయ భాషల్లో చిత్రాలను ప్రేక్షకులకు ముందుకు తెస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందించ‌డానికి మీ ముందుకు వ‌స్తుంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్‌లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version