పాలమూరు యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

పాలమూరు యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. కనుక ఉపాధ్యాయ వృత్తిలో వున్నా వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టుల్ని యూనివర్సిటీ భర్తీ చేస్తోంది. పీజీ కాలేజ్-మహబూబ్‌నగర్, పీజీ సెంటర్-జోగులాంబ గద్వాల, పీజీ సెంటర్-వనపర్తి, పీజీ సెంటర్-కొల్హాపూర్‌లో ఈ పోస్టులు వున్నాయి.

 

jobs

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. కేవలం టెంపరరీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరానికి మాత్రమే ఈ పోస్టుల్ని ప్రకటించింది. ఇంగ్లీష్, ఎంబీఏ, ఎకనమిక్స్, కంప్యూటర్ సైన్స్, కామర్స్, కెమిస్ట్రీ, జువాలజీ, తెలుగు, బాటనీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్ సబ్జక్ట్స్ లో ఈ ఖాళీలు వున్నాయి.

సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. పీహెచ్‌డీ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2021 సెప్టెంబర్ 23. పాలమూరు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు దరఖాస్తు ఫామ్ పంపాలి. దరఖాస్తు ఫీజు- రూ.300. అభ్యర్థులు Registrar, Palamuru University పేరుతో డీడీ తీసి, అప్లికేషన్ ఫామ్‌కు జత చేసి పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలని http://palamuruuniversity.ac.in/rect-notf.pdf లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version