పాదయాత్రలో నారా లోకేష్ కు గుండె పోటు రావచ్చు – RGV

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. అయితే, తాజాగా నారా లోకేష్‌ చేస్తున్న పాదయాత్రపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రాం గోపాల్‌ వర్మ.

నారా లోకేష్ పాదయాత్ర ఆపేస్తే, చాలా మంచిదన్నారు RGV. గుండె పోటు వచ్చిందని చెప్పి.. పాదయాత్ర ను నారా లోకేష్‌ ఆపేస్తాడంటూ సెటైర్లు పేల్చారు RGV. పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేష్‌.. ఒక టెర్రిఫిక్ ఐడియా చేయచ్ఛు! చెస్ట్ నొప్పో ,లిగమెంట్ తెగిందనో చెప్పి, డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని, పాద యాత్ర ఆపేస్తే తెలుగు దేశం పార్టీ మరియు చంద్రబాబు ఆరోగ్యయానికి చాలా మంచిది. ఇది నా ఉచిత చచ్చు సలహా! అంటూ కామెంట్‌ చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version