రవితేజ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్..”రామారావు ఆన్ డ్యూటీ” అప్డేట్ వచ్చేసింది

-

మాస్ మహారాజా రవితేజ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. క్రాక్ సినిమాతో తన కెరీర్ కి కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మంచి ఊపును అందించాడు మాస్ మహారాజ రవితేజ. క్రాక్ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రేపు ఉదయం 10:08 గంటలకు రవితేజ అభిమానుల కోసం ఆసక్తికరమైన అప్డేట్ రాబోతున్నట్టు ఓ పోస్టర్ ను వదిలిన చిత్రబృందం. మెసేజ్ అనౌన్స్మెంట్ అంటూ మేకర్స్ ఉరించగా అభిమానులు సినిమా నుంచి టీజర్ అప్డేట్, ఫస్ట్ సింగిల్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version