ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ నటనకు ఫిదా అయినా టైటానిక్ నటి..

-

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు మార్చి 24 విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి మరి విజయాన్ని అందుకుందో తెలిసిందే అంతే కాకుండా ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి అయితే తాజాగా ఈ విషయంపై ఓ హాలీవుడ్ నటి స్పందించారు..

ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేశారు. ఇందులో వీరిద్దరి నటన ఎంత అద్భుతంగా ఉంది అలాగే వీరిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి వేరే నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయని చెప్పాలి ముఖ్యంగా రాజమౌళి పూర్తిస్థాయిలో వీరిద్దరిలో ఉన్న నటనను బయటకు తీశారని చెప్పాలి అలాగే ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో అవార్డులు రాగా తాజాగా ఆస్కార్ నామినేషన్ కు కూడా వెళ్ళబోతుందని వార్తలు వినిపించాయి అయితే ఆ విషయంలో ఇప్పటికే ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఈ సినిమాలో ఈ హీరోలు ఇద్దరు మధ్య పోటాపోటీగా నడిచిన నాటు నాటు పాట ఎంతో ఫేమస్ అయ్యింది అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ హాలీవుడ్ నటి ఫ్రాన్సెస్ ఫిషర్ తన ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.

జేమ్స్ కెమెరామెన్ దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ మూవీలో హీరోయిన్ కేట్ విన్స్లేటర్ తల్లిగా నటించి మెప్పించిన నటి ఫిషర్ ఈమె తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటన తనకి ఎంతగానో నచ్చిందని ప్రశంసించారు అంతేకాకుండా అతని డాన్స్ మైమరిపించిందని ముఖ్యమైన పలు కీలక సన్నివేశాల్లో అతను యాక్టింగ్ ఎంతో బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు దీంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది అంతే కాకుండా రామ్ చరణ్ తో పాటు చిత్ర బృందానికి సైతం అందరూ మరోసారి ప్రశంశలు తెలుపుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version