రాజకీయాలపై పూనమ్‌ ట్వీట్.. వర్మ రియాక్షన్‌ ఇలా..

-

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఏ ట్వీట్ చేసినా హాట్ టాపిక్ క్షణాల్లో వైరల్ అవుతోంది. లేటెస్ట్ గా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మధ్య పాలిటిక్స్ కామెడీగా మారాయి.. కామెడీ మాత్రం సీరియస్ గా మారిపోయింది.. అంటూ పూనమ్ ట్వీట్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో కమెడియన్ పృథ్వీ రాజ్ మినిస్టర్ అంబటి రాంబాబును శ్యామ్ బాబు గా ఇమిటేట్ చేశారంటూ పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసేందే. దీంతో పూనమ్ ట్వీట్ బ్రో మూవీను ఉద్దేశించే ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే.. ఈ ట్వీట్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. “లేదు చెల్లెమ్మా… వాస్తవానికి రాజకీయాలు సినిమాల్లా మారుతున్నాయి, సినిమా రాజకీయమయం అవుతోంది అనుకుంటున్నాను” అని బదులిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పూనమ్ కౌర్, వర్మ చేసిన ట్వీట్లకు విశేష రీతిలో స్పందన వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version