ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్.. నెట్టేసిన అనుచరులు!

-

సీఎం రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకే రక్షణ కరువైనట్లు తెలుస్తోంది. నా వాహనాన్ని ఆపిన పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దూషించాడు.అంతటితో ఆగకుండా ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు.

ఈ ఘటనలో చోద్యం చూస్తూ ఏసీపీకే గొడవ వద్దంటూ తోటి పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు ఆపారు.
దీంతో తన వాహనాన్ని ఎలా ఆపుతారని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులుని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దూషించడంతో పాటు ఆయన అనుచరులు దాడి చేయడంతో ట్రాఫిక్ ఏసీపీ వారితో వాగ్వాదానికి దిగాడు.దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version