సరిహద్దుల్లో పహారా కాసిన హీరో రానా..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను వరుసగా చేసుకుంటూ దూసుకుపోతున్నాడు రానా. అయితే రానా ఘాజి అనే సినిమాలో సైనికుడు పాత్రలో నటించి తన నటనతో మెప్పించాడు అనే విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఏకంగా నిజమైన సైనికుడు గా మారిపోయాడు రానా .

ఇటీవల ఏకంగా సైన్యంలో ఒక రోజంతా గడిపి రియల్ లైఫ్ అడ్వెంచర్ చేసి ప్రస్తుతం అభిమానులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. రోజంతా ఏకంగా సరిహద్దులో సైనికుడు గా మారి పహారా కాసాడు సినీ హీరో రానా. డిస్కవరీ ప్లస్ ఇండియా కార్యక్రమమైన మెషిన్ ఫ్రంట్ లైన్ కోసం నిజంగానే భారత సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ జవాన్ అవతారమెత్తిన రానా ఒక రోజు మొత్తం సరిహద్దుల్లోని జైసల్మేర్ ప్రాంతంలో పహారా కాసాడు. ఇక సరిహద్దుల్లో ఒక రోజంతా గడిపిన రానా ఏకంగా తనకి ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సరిహద్దుల్లో సైనికుడిగా పహారా కాసేందుకు అవకాశం ఇచ్చిన డిస్కవరీ ప్లస్ కు ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు నటుడు దగ్గుబాటి రానా.

Read more RELATED
Recommended to you

Exit mobile version