ఈ నెల 16 నుంచి రంజీ ట్రోఫీ .. బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌

-

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి త‌గ్గుముటం ప‌ట్ట‌డంతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశవాలీ క్రికెట్ టోర్న‌మెంట్ అయిన రంజీ లీగ్ ను ఈ నెల ఫిబ్ర‌వ‌రి 16 నుంచి మార్చి 5 వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగ రంజీ ట్రోఫీ లీగ్ ఫిబ్ర‌వ‌రి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోదు కావ‌డంతో బీసీసీఐ రంజీ ట్రోఫీ లీగ్ ను వాయిదా వేస్తు నిర్ణ‌యం తీసుకుంది.

అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మెరుగు అవ‌డంతో రంజీ ట్రోఫీ లీగ్ ను మ‌ళ్లీ నిర్వ‌హించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ నెల 16 నుంచి మార్చి 5 వ తేదీ వర‌కు రంజీ ట్రోఫీని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అలాగే గ‌తంలో ప్ర‌క‌టించిన రంజీ ట్రోఫీ గ్రూప్ ల‌లో కూడా స్వ‌ల్ప మార్పులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో గ్రూప్ లో ఆరు జ‌ట్లుగా ఉండేవి. కానీ ప్ర‌స్తుతం ప్ర‌తి గ్రూప్ లో నాలుగు జ‌ట్లను మాత్ర‌మే కేటాయించింది. దీంతో గ్రూప్ ల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version