ఆరేళ్ళ బాలికపై వృద్దుడు రేప్…!

-

ఒక పక్క లాక్ డౌన్ తో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్న అవసరానికి కూడా బయటకు రావడానికి లేదు ఇప్పుడు. ఎవరు బయటకు వచ్చినా సరే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. దీనితో ప్రజలు కూడా అవసరం అనుకుంటే మినహా బయటకు రావడం లేదు. కాని కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. అనవసరంగా బయటకు వచ్చి తిరగడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చేస్తున్నారు.

జనాలు బయటకు రాకపోయినా సరే రేప్ లు మాత్రం ఆగడం లేదు. ఒక వృద్దుడు ఆరేళ్ళ బాలికపై రేప్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణాలో జరిగింది ఈ సంఘటన. తాత వయసు ఉండే వృద్దుడు బాలికపై రేప్ చేసాడు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో బాలిక అంగన్ వాడీ కేంద్రానికి వెళ్ళగా అక్కడి నుంచి తిరిగి వస్తుంది. ఆ బాలికను గమనించిన ఒక వృద్దుడు…

ఆమెకు చాక్లెట్ ఆశ చూపించి… ఆమె అతని వద్దకు రాగానే ఇంట్లోకి తీసుకుని వెళ్లి రేప్ చేసాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. దీనిపై పోలీసు శాఖ కూడా ఆగ్రహ౦ వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version