శ‌రీరంలో దిగిన 3 అడుగుల ఇనుప కడ్డీ.. స్విమ్స్‌లో స‌ర్జ‌రీ విజ‌య‌వంతం

-

తిరుపతి పట్టణంలోని స్విమ్స్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన సర్జరీ విజయవంతం అయింది. శరీరంలో దిగిన మూడు అడుగుల ఇనుప కడ్డీ దిగింది. ఆ ఇనుప కడ్డీ ని… స్విమ్స్ హాస్పిటల్ వైద్యులు చాలా విజయ వంతంగా బయటకు తీశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. క్రిష్ణాజిల్లా, కైకలూరుకు చెందిన లక్ష్మయ్య.. తాపీ పని చేస్తూ పై భవనం నుంచి కింద పడ్డాడు. దీంతో…. తొడ భాగంగా నుంచి భుజం వరకు చొచ్చుకుపోయింది 3 అడుగుల ఇనుప కడ్డీ. మొదట కైకలూరు, విజయవాడ, గుంటూరు హాస్పిటల్ లో ఆ వ్యక్తికి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి లోని… స్విమ్స్ కు తరలించారు.

ఈ నేపథ్యంలోనే… ఆ వ్యక్తికి ఆపరేషన్‌ చేసి… 10 ఎం. ఎం సైజు గల 3 అడుగుల ఇనుపకడ్డీని తొలగించారు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు. దీంతో ప్రాణా పాయం నుండి భయటపడి క్రమంగా కోలుకుంటున్నాడు తాపీ మేస్త్రీ లక్ష్మయ్య. ఇక స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు… చేసిన సేవలపై పలుగురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version