ర్యాష్ డ్రైవింగ్ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి పాండురంగా నగర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలను వదిలినట్లు సమాచారం. అంతేకాకుండా కారు ఢీకొట్టిన ఘటనలో మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.దీంతో కార్ డ్రైవర్‌ను పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబీకులు, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.