గుంటూరు కారం సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం చెప్పిన రష్మీ..!

-

సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. మిక్స్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇందులో చాలా రోజుల తర్వాత పూర్ణ కీలక పాత్ర పోషించింది మొదట ఆ పాత్ర కోసం రష్మిని అడిగినట్లు తెలుస్తోంది.

ఈ ఆఫర్ రష్మీ రిజెక్ట్ చేసిందట ఆమె రిజెక్ట్ చేసినట్లు రెండు మూడు రోజులుగా వార్తలు నెట్టింట తెగ వినపడుతున్నాయి దీంతో నెటిజెన్స్ పలు పోస్టులు పెట్టారు దీనిపై రష్మి స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అబద్ధం నన్ను అసలు సంప్రదించలేదు కనుక రిజెక్ట్ చేసే అవకాశం లేదు. అలానే పూర్ణ గారు ఎవరు చేయని అద్భుతమైన పని చేశారని ఇలాంటి తప్పుడు వార్తలు నా పట్ల ప్రతికూలతని తెచ్చి పెట్టొచ్చు అని రష్మీ అంది. దయచేసి అటువంటి వార్తలని ప్రోత్సహించకండి అని పోస్ట్ చేసింది రష్మీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version