రణ్‌బీర్‌ కపూర్ నన్ను అలా పిలుస్తాడు..రష్మిక మందన ఇంట్రెస్టింగ్ కామెంట్స్….

-

క్యూట్ హీరోయిన్ రష్మిక మందన..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను ఏలుతోంది. ఇప్పటికే అన్ని ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన రష్మిక మందన..ప్రస్తుతం బీ టౌన్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ లో నటిస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ లో ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయినట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది రష్మిక. ‘మనాలి’ షూటింగ్ ఎక్స్ పీరియెన్స్ షేర్ చేసుకుంది ఈ సుందరి.

తాను తొలుత రణ్ బీర్ కపూర్ ను చూసి చాలా భయపడ్డానని, కానీ, కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఫ్రీ అయిపోయానని చెప్పింది. షూటింగ్ టైమ్ లో రణ్ బీర్ తనను ‘మేడమ్’ అని పిలుస్తాడని చెప్తూ రష్మిక హ్యాపీగా ఫీలయింది. సందీప్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ చాలా బాగుందని తెలిపింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు11 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయాడు. షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ తీసిన సందీప్..ఇప్పుడు రణ్ బీర్ తో ‘యానిమల్’ పిక్చర్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version