‘పీఎం కేర్స్​ ఫండ్​’ ట్రస్టీగా రతన్​ టాటా

-

దేశంలో సంక్షోభాలు తలెత్తినప్పుడు.. అవసరంలో ఉన్న వారిని ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. దీనికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీల బోర్డు సమావేశానికి హాజరైన మోదీ.. బోర్డులో కొత్తగా ట్రస్టీలుగా చేరిన ప్రముఖులకు స్వాగతం పలికారు.

పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీలుగా ఇటీవల నామినేట్ అయిన టాటా గ్రూప్​ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్​సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా.. తొలిసారి ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భేటీలో ట్రస్టీల హోదాలో పాల్గొన్నారు. ‘పీఎం కేర్స్​ ఫర్ చిల్డ్రన్​’ పేరిట 4,345 మంది చిన్నారులకు అండగా నిలవడం సహా.. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై ట్రస్టీలంతా చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version