రేషన్ కార్డు నిబంధనలు మార్చాలి’ : అసదుద్దీన్ ఓవైసీ

-

తెలంగాణలో కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి నిబంధనలు మార్చాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 5.67 లక్షల నిరుపేద కుటుంబాలు అంత్యోదయ అన్న యోజన కార్డులను ఉపయోగించు కుంటున్నారని అసదుద్దీన్ గుర్తుచేశారు.ఈ మేరకు రేషన్‌ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీకి ఆయన వినతి పత్రం సమర్పించారు.

గ్రామాల్లో రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలు గా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు.ఈ క్రమంలో దీర్ఘకాలిక,ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే, రేషన్ కార్డు, హెల్త్ కార్డు కోసం విధించిన ఆదాయ నిబంధనలను మార్చాలని పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version