దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఇక ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి వినూత్నమైన ప్రయోగాలతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ వీఐ ఆనంద్- రవితేజ కాంబోలో వచ్చిన డిస్కో రాజా జనవరి 24న విడుదల అయింది. ఇక రవితేజ నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా ఆయన ఆకట్టుకుంటాడు. ఇప్పుడు కూడా డిస్కో రాజాగా చింపేసాడు రవితేజ.
రవితేజ సరసన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేసాడు. అయితే చిత్రానికి మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ దర్శకుడు వి ఐ ఆనంద్ ఆ కథను డెవెలప్ చేసిన విధానం, చూపించిన పద్దతి చాలా స్లో గా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాయి. ఓవరాల్ సినిమా యావరేజ్ అనిపించుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రల్లో డిస్కో రాజా 2.58 కోట్లు షేర్ రాబట్టి ఓకే అనిపించింది.
‘డిస్కో రాజా’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 1.1 కోట్లు
సీడెడ్ – 36.6 లక్షలు
గుంటూరు – 17.2 లక్షలు
ఉత్తరాంధ్ర – 31 లక్షలు
తూర్పు గోదావరి – 20.3 లక్షలు
పశ్చిమ గోదావరి – 15.4 లక్షలు
కృష్ణా – 18 లక్షలు
నెల్లూరు – 10.2 లక్షలు
——————————————————
మొదటి రోజు మొత్తం షేర్ – 2.58 కోట్లు
——————————————————