KHILADI : ఖిలాడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ.. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శకత్వం లో.. రూపొందుతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకంపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు.

ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఖిలాడీ సినిమా నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అనౌన్స్‌ చేసింది ఖిలాడీ చిత్ర బృందం. శివ రాత్రి కానుకగా…  ఫిబ్రవరి 11 వ తేదీన.. ఖిలాడీ సినిమా… విడుదల చేయనుంది. ఈ మేరకు అధికారికంగా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్‌.  ఇక ఈ తాజా అప్డేట్‌ తో..  మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్‌ లో ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version