బంజారాహిల్స్ లో రాయలసీమ రౌడీలు దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘటనలో ఏకంగా 80 మందిని నిందితులుగా ఎఫ్ఐఆర్ లో బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 10 జహీరా నగర్ లో ఉన్న ల్యాండ్ అక్రమణ కోసం 90 మందితో గుండాలు చొరబడ్డారు. ఉమ్మడి ఏపీలో… ఏపీ జేమ్స్ అండ్ జ్యువలరీ పార్క్ లిమిటెడ్ కు స్థలం కేటాయించారు. దీంతో అందులో ఉన్న రెండు ఎకరాల్లో సంస్థ ఆడిటోరియం నిర్మించగా… మిగతా ఖాళీగా ఉన్న మరో అర ఎకరంపై పలువురు కన్నేశారు.
సుమారు రూ.100 కోట్లు ఆ అర ఎకరం పలుకుతోంది. అర ఎకరం కోసం భూమి తమదేనని కోర్టులో సైతం పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో లాండ్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసింది ఏపీ జేమ్స్ అండ్ jewelers ల సంస్థ. నిన్న ఉదయం 6 గంటల 30 నిమిషాలకు 90 మందితో అక్రమంగా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే… అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు రౌడీలు. పీపుల్ టెక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారే ఈ దాడి చేసినట్టు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఫిబ్రవరి 2021 లోనూ ఇదే తరహాలో దాడులకు ప్రయత్నం చేశారు. గతంలోనూ వీరిపై ఫిర్యాదు చేసమంటోంది ఏపీ జేమ్స్ అండ్ జ్యువెలర్స్ సంస్థ. ఇక తాజాగా విశ్వ ప్రసాద్, సుభాష్ పులిశెట్టి, మిధున్ కుమార్, వివిఎస్ శర్మ తో పాటు 80 మందిపై కేసులు నమోదు చేశారు.