కడపలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశానని,అయితే దానికి ముఖ్యమంత్రి జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా ముందుకు కదిలిందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని చంద్రబాబు నిలదీశారు. రాయలసీమ ద్రోహి జగన్ అని మండిపడ్డారు.అలాంటి వ్యక్తి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు.
నవ్యాంధ్రను అభివృద్ధి చేసే వరకూ వదిలిపెట్టనని చంద్రబాబు తెలిపారు. జగన్ ఒక సైకో అని.. ఆయనకు ఎవరినీ గౌరవించారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కన్నతల్లికి కూడా తిండి పెట్టలేని వ్యక్తి వైఎస్ జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు తెలిసిందల్లా దోచుకోవడమేనని విమర్శించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని చంద్రబాబు విమర్శించారు. నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్ఎ చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు.