ట్రెండ్ ఇన్: భారీ బడ్జెట్‌తో RC15..శంకర్ మార్క్ మేకింగ్

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం RC15. కార్తీక్ సుబ్బరాజ్ ఈ ఫిల్మ్ కు స్టోరి అందించగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్.

రామ్ చరణ్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తు్న్నారని కొద్ది రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా , టెంపర్ ఉన్న యువకుడిగా మూడు పాత్రల్లో రామ్ చరణ్ పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారట. వ్యవస్థను ప్రశ్నించే నేపథ్యంలో స్టోరి, క్యారెక్టరైజేషన్స్ లో శంకర్ మార్క్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

కమల్ హాసన్ ‘భారతీయుడు’ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో సొసైటీకి చక్కటి సందేశాన్ని శంకర్ అందించబోతున్నారని తెలుస్తోంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ చిత్ర అప్ డేట్ కోసం మెగా అభిమానులు మై క్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #RC15 హ్యాష్ ట్యాగ్ ఆర్ సీ 15 అని వరుస ట్వీట్లు చేశారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘అధికారి’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న సినిమా కు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ ఇస్తారని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version