RC15 : నెక్స్ట్ షెడ్యూల్ లో భారీ బడ్జెట్ సాంగ్ షూటింగ్.!

-

రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.అయితే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తోంది. కాని ఇప్పటి వరకూ ఈమూవీ నుంచి ఫ్యాన్స్ కోసం సరిగా అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో మెగా అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక మూవీ ఎప్పటి నుండో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో  షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కు  సర్కారోడు  లేదా పబ్లిక్ సర్వెంట్ అనే టైటిల్లు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. పరిశీలనలో ఉండగా.. ఈమూవీలో రామ్‌చరణ్‌ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. కథ కూడా చాలా ఆసక్తి కరమైన మలుపులు తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. ఒక సామాన్య రైతు పొలిటికల్ సమరంలో ఎలా నిలిచి గెలిచాడు, అతని కొడుకు అవినీతి పై సమరం లో  ఎలా పోరాడారు అన్నది శంకర్ స్టయిల్ లో సుపెర్ గా ఉండబోతుందట.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ని ఫిబ్రవరి 9 నుండి 16 వరకు వైజాగ్ లో జరుపనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ని యూనిట్ చిత్రీకరించనుందట యూనిట్. ఇక ఈ పాటను కూడా శంకర్ స్టయిల్ లో భారీ ఖర్చుతో షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈసినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.మరో హీరోయిన్ అంజలి కూడా ఈమూవీలో  నటిస్తున్నారు. వీరితో పాటు సునీల్‌, దర్శకుడు ఎస్‌.జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version