బ్యాటింగే కాదు.. కవిత్వంలోనూ విరాట్ కోహ్లీ స్టారే.. మీరూ ఓ లుక్కేయండి

-

స్టార్ కమెడియన్ మిస్టర్ నాగ్స్ అదేనండి డానిష్ సెయింట్ .. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అని తెలిసిందే. విరాట్ తో తనకు ఉన్న చనువుతో నాగ్స్ తరచూ కోహ్లీనీ పాజిటివ్ ట్రోల్ చేస్తుంటాడు. అయితే తాజాగా నాగ్స్ విరాట్ కు ఓ టెస్ట్ పెట్టాడు. అదేంటంటే..?

ఏప్రిల్ 2న జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడి శుభారంభం చేసింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు. దీంతో ఐపీఎల్ 16వ సీజన్​లో 8 వికెట్ల తేడాతో భారీ విజయంతో బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్​ ప్రారంభానికి ముందు మిస్టర్ నాగ్స్​తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో పంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.

ఈ ఇంటర్వ్యూలో నాగ్స్​.. ‘ట్రిప్’, ‘టైడ్’, ‘మ్యాన్’, ’49’ పదాలు వచ్చేలా ఓ కవిత్వం చెప్పాల్సిందిగా విరాట్ కోహ్లీని కోరాడు. దీంతో విరాట్​ కూడా ఎటువంటి తడబాటుకు లోనవ్వకుండా.. “మీ కలలను సాకారం చేసుకోండి, మీలోని కాంతిని వెలిగించండి. ఎలాంటి క్లిష్ట సమయాల్లో అయినా బ్యాటింగ్ చేయండి. కొన్నిసార్లు 263 రావచ్చు, ఇంకొన్నిసార్లు 49తో సరిపెట్టుకోవచ్చు. జీవితం నిన్ను పచ్చడి చేసేయొచ్చు. కానీ ఆ సమయంలోనూ చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వేసెయ్. నువ్వు సెంచరీ చేసినా, లేక డక్ ఔట్ అయినా.. జీవితం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడా నిలిచిపోకు” అంటూ స్పాంటెనియస్​గా పద్యం రాసి చెప్పేశాడు విరాట్​.

Read more RELATED
Recommended to you

Exit mobile version