RCB vs RR : రాజస్తాన్‌ ఘోరా పరాజయ.. 59 పరుగులకే అలౌట్‌

-

IPL 2023లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తా చాటింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్స్ విజృం‍భణతో రాజస్తాన్‌ను 112 రన్స్‌ తేడాతో చిత్తు చేసింది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ను 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ చేసింది. జో రూట్ 10, హెట్ మేయర్ 35 పరుగులు చేశారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, జో బట్లర్ సహా నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. బెంగళూరు బౌలర్లలో పార్నెల్ 3, బ్రాస్ వెల్, శర్మలకు చెరో రెండు వికెట్లు, మహమ్మద్ సిరాజ్, మాక్స్ వెల్ లకు చెరో ఒక వికెట్ పడ్డాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ కోహ్లీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. డుప్లెసిస్ 55, మాక్స్ వెల్ 54 పరుగులతో చెలరేగారు. అనుజ్ రావత్ చివర్లో 11బంతుల్లో 29 పరుగులు చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో 171 పరుగులు చేయగల్గింది. లేకపోతే ఓ మోస్తారు స్కోరుకే పరిమితమయ్యేది. రాజస్థాన్ బౌలర్లలో అడమ్ జంపా, కేఎం ఆసీఫ్ లకు చెరో రెండు వికెట్లు, సందీఫ్ శర్మకు ఒక వికెట్ పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version