కనీస మద్దతు ధర కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.కిసాన్ మజ్దూర్ మోర్చా,సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి.ఉత్తరప్రదేశ్, హర్యానా,పంజాబ్, కేరళ,కర్ణాటక రైతులు ఢిల్లీ చలో మార్చ్‌లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఢిల్లీలో రైతుల నిరసనపై కేంద్ర వ్యవసాయ శాఖ సహాయక మంత్రి అర్జున్ ముండా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రెండు విడతల చర్చల్లో సత్ఫలితాలు రాలేదు. దీనిపై మరింత చర్చ అవసరం. పరిష్కారం కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుంది. మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల నిరసనను తప్పుదోవపట్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు.