మొబైల్స్ తయారీదారు రియల్‌మి దసరా, దీపావళి పండుగల సందర్భంగా తన ఉత్పత్తుల అమ్మకాల్లో ఓ కొత్త రికార్డును సృష్టించింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు రియల్‌మి ఫెస్టివ్ డేస్ సేల్‌ను ఆన్ లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాల్లో నిర్వహించింది. అందులో భాగంగా ఆ కంపెనీ భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. మొత్తం 83 లక్షల ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది.
రియల్‌మి అమ్మిన మొత్తం ఉత్పత్తుల్లో 63 లక్షల ఉత్పత్తులు స్మార్ట్‌ఫోన్లే కావడం విశేషం. అలాగే మరో 13.5 లక్షల నార్జో ఫోన్లు, 12 లక్షల సి11 ఫోన్లు, 16 లక్షల రియల్‌మి 7 సిరీస్ ఫోన్లను కూడా రియల్‌మి విక్రయించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్‌లో రియల్‌మి ప్రొడక్ట్స్ అమ్మకాలు 20 శాతం పెరగడం విశేషం. ఆన్ లైన్, ఆఫ్‌లైన్ రెండు మాధ్యమాల్లోనూ జరిగిన కొనుగోళ్లను బట్టి రియిల్‌మి ఆ వివరాలను వెల్లడించింది.
ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్ గా రియల్‌మి వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల అమ్మకాలు జరపగా వాటిల్లో 3 కోట్ల అమ్మకాలు ఇండియా నుంచే రావడం విశేషం. కౌంటర్ పాయింట్ అనే సంస్థ తెలిపిన ప్రకారం రియల్‌మి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో భారతలో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న షియోమీకి రియల్‌మి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.