లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెడ్ పై డిసెంబర్ 16 వరకు 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని రిజర్వ్ బ్యాంకు విధించిన సంగతి తెలిసిందే. డిపాజిటర్లకు రూ .25 వేలకు మించి విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే అంతకంటే ఎక్కువ కావాలి అంటే మాత్రం కొన్ని అనుమతులు కావాల్సిందే అని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. ఆర్‌బిఐ నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంక్ డిపాజిటర్లు రూ .25 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి నాలుగు ప్రత్యేక షరతులు ఉన్నాయి.
1) డిపాజిటర్ యొక్క వైద్య చికిత్సకు సంబంధించి లేదా అతని / ఆమెపై ఆధారపడిన ఏ వ్యక్తి అయినా
2) భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల విద్య కోసం డిపాజిటర్ లేదా అతనిపై ఆధారపడిన ఏ వ్యక్తి యొక్క ఉన్నత విద్య ఖర్చు కోసం అయినా…
3) వివాహం లేదా డిపాజిటర్ లేదా అతని / ఆమె పిల్లలు లేదా అతని / అతనిపై ఆధారపడిన ఇతర వ్యక్తి యొక్క ఇతర వేడుకలకు సంబంధించి తప్పనిసరి ఖర్చులు చెల్లించడం కోసం.
4) ఇతర అనివార్యమైన అత్యవసర పరిస్థితులకు సంబంధించి
అయితే ఇలా కూడా 5 లక్షలకు వరకే విత్ డ్రా చేసుకోవాలి.