కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనకు అదే కారణమా ?.

-

తెలంగాణా సిఎం కేసీఆర్ నిన్ననిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఏకంగా రాష్ట్రంలో ఉన్న 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. ఉపాధ్యాయ, పోలీస్ తదితర అన్ని ఉద్యోగాలు కలిపి ఈ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే ఇంత సడన్ గా ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారా అనేది చూస్తే అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

CM KCR

మా నీళ్ళు, మా నిధులు అనే నినాదంతో తెలంగాణా ఉద్యమం కోసం పని చేసిన అందరూ ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మొన్న దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో గట్టిగానే కనపడింది. ఇప్పుడు త్వరలో కొన్ని కార్పోరేషన్ ఎన్నికలు, అలానే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉండడంతో ఈ ప్రకటన వచ్చిందని అంటున్నారు. చూడాలి ఇందులో నిజం ఎంత ఉంది అనేది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version