సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలు అనగానే అభివృద్దిలో వెనుకబడిన రాష్ట్రాలు అని అంటారు. ఏ పార్టీ పాలించినా అభివృద్దిలో ఆ రాష్ట్రాలు ఏ మాత్రం కూడా మెరుగ్గా లేవు అనే ఆరోపణలు ఉన్నాయి. కాని కరోనా వైరస్ విషయంలో దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. దాదాపు ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. ప్రతీ రాష్ట్రంలో కూడా అక్కడ రికవరీ రేటు భారీగానే ఉంది.
అక్కడ దాదాపు అన్ని రాష్ట్రాల్లో 65 శాతం రికవరీ రేటు ఉంది. ఒక్క అసోం లోనే కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉంది. అక్కడ రోగులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా కరోనా రికవరీ లో చాలా సమర్ధంగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని అక్కడ వేగంగా రోగులు బయటపడుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 63 శాతంగా మాత్రమే ఉంది.