తెలంగాణలో గత రెండు రోజుల నుంచి భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ లోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు… మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక అటు తెలంగాణ మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్శాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉన్నదని.. అధికారులను హెచ్చరించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని.. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.